● చింతపల్లి ఎంపీడీవో సీతామహలక్ష్మి ఆదేశం
చింతపల్లి: రానున్న వేసవి దృష్ట్యా మండలంలోని ప్రతీ గ్రామంలో ఉన్నటువంటి మంచినీటి వనరులకు సంబంధించి ఇంజనీరింగ్ సిబ్బంది విధిగా పరీక్షలు నిర్వహించాలని ఎంపీడీవో సీతామహాలక్ష్మి ఆదేశించారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో తాగునీటి సరఫరా విభాగం ఇంజనీరింగ్ అదికారులు, అసిస్టెంట్లతో ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా తాగునీరు సేవించేలా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఏ గ్రామంలోనైనా తాగునీటిలో ఇబ్బందులు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత గ్రామ కార్యదర్శితో పాటు పంచాయతీ అధికారులకు తెలయజేయాలన్నారు.గ్రామాల్లో వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిప్యూటీ ఎంపీడీవో బీఏబీల్ మూర్తి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ స్వర్ణలత పాల్గొన్నారు.


