బాకై ్సట్‌పై స్పష్టమైన ప్రకటన చేయాలి | - | Sakshi
Sakshi News home page

బాకై ్సట్‌పై స్పష్టమైన ప్రకటన చేయాలి

Feb 25 2026 8:59 AM | Updated on Feb 25 2026 8:59 AM

బాకై ్సట్‌పై స్పష్టమైన ప్రకటన చేయాలి

బాకై ్సట్‌పై స్పష్టమైన ప్రకటన చేయాలి

ఆదివాసీ సంఘాల డిమాండ్‌

పెదబయలు: ఏపీఎండీసీ బాకై ్సట్‌ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని ఆదివాసీ ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు, అఖిలపక్ష పార్టీల నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం పెదబయలులోని గిరిజన ఉద్యోగుల సంఘ భవనంలో జెడ్పీటీసీ ఆధ్వర్యంలో, గిరిజన సంఘ నాయకుడు జంపరంగి సునీల్‌ అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం బాకై ్సట్‌ తవ్వకాల జోలికి వస్తే సహించేది లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలని వారు కోరారు. ఆదివాసీలకు 100 శాతం రిజర్వేషన్‌ కల్పించే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. గిరిజన ఎమ్మెల్యేలు గిరిజన సలహా మండలి సమావేశంలో బాకై ్సట్‌ తవ్వకాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని కోరారు. నాయకులు మాట్లాడుతూ.. అరకు, చింతపల్లి, అనంతగిరి, సప్పర్ల, గుర్తేడు, గూడెం, కాటంరాజ్‌ కొండల్లో సుమారు 616 మిలియన్‌ టన్నుల బాకై ్సట్‌ నిల్వలు ఉన్నాయని, ఏపీఎండీసీ పేరిట లీజులు మంజూరు చేసి మైనింగ్‌ను పునఃప్రారంభించాలని సిఫార్సు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాకై ్సట్‌ తవ్వకాల వల్ల రూ. 1.50 లక్షల కోట్ల పెట్టుబడులు, 60 వేల ఉద్యోగాలు వస్తాయనే ప్రచారంలో వాస్తవం లేదు. ఇది కేవలం ప్రజలను భ్రమల్లో ముంచడానికేనని, కార్పొరేట్‌ కంపెనీల కోసం ఆదివాసీల భూములను, అడవులను దోచుకోవడానికే మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల పేరిట ఇప్పటికే జరుగుతున్న కుట్రలను ఆదివాసీలు వ్యతిరేకిస్తున్నారని వారు గుర్తుచేశారు. బాకై ్సట్‌ తవ్వకాల వల్ల దట్టమైన అడవులు నశిస్తాయన్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడమే కాకుండా నీటి కాలుష్యం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల ప్రధాన జీవనోపాధి అయిన కాఫీ సాగు, వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు నాశనమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు ధర్మన్న పడాల్‌, గిరిజన సమాఖ్య జిల్లా నాయకులు కూడ రాధాకృష్ణ, మాజీ ఎంపీపీలు సల్లంగి ఉమామహేశ్వరరావు, జర్సింగి సూర్యనారాయణ పాల్గొన్నారు. అలాగే వైఎస్సార్‌సీపీ నాయకులు గంపరాయి సూరయ్య, పాంగి సింహాచలం, పల్టాసింగి ధనరాజ్‌, జనసేన పార్టీ నాయకులు కూడ కృష్ణబాబు, గిరిజన సంఘం నాయకులు బొండా సన్నిబాబు, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement