ఘనంగా శివరాత్రి ఉత్సవాలు
సాక్షి,పాడేరు: జిల్లా వ్యాప్తంగా అన్ని శివాలయాల్లోను శివరాత్రి ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తుల శివనామస్మరణతో హోరెత్తాయి.పవిత్ర పుణ్యక్షేత్రమైన మత్స్యగుండం మత్స్యలింగేశ్వరస్వామి ఆలయంతో పాటు జిల్లాలోని అన్ని శివాలయాల్లోను వేకువజామునుంచి భక్తుల తాకిడి నెలకొంది. మత్స్యలింగేశ్వరస్వామితోపాటు మత్స్యదేవతలను దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. ఇన్‌చార్జి ఆర్డీవో లోకేశ్వరరావుతో పాటు అన్నిశాఖల అధికారులు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
పార్వతీపరమేశ్వరుల విగ్రహాల ఉరేగింపు
పాడేరు పట్టణంలోని గిరికై లాస క్షేత్రంలోని ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయంలోను శివరాత్రి ఉత్సవాలు రెండోరోజు ఘనంగా జరిగాయి. శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను పట్టణ పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. దేవతామూర్తులు, శక్తి వేషాలు, డప్పు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, అన్ని వర్గాల భక్తులు, వర్తక సంఘాల నేతలు ఉరేగింపులో పాల్గొన్నారు. ఆదివారం ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయంలో అన్నసమారాధన ఏర్పాటుకు ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది. పాత పాడేరు, ఐటీడీఏ పీవో బంగ్లా, లగిశపల్లి, వంజంగి, గెడ్డంపుట్టు, తామారపల్లి, కరకపుట్టు, తురాయిమెట్ట శివాలయాలతో పాటు పోలుపుట్టు, తుమ్మరమెట్ట నాగదేవత మందిరాల్లోను శివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
జిల్లావ్యాప్తంగా ప్రారంభం
ఘనంగా శివరాత్రి ఉత్సవాలు
ఘనంగా శివరాత్రి ఉత్సవాలు
ఘనంగా శివరాత్రి ఉత్సవాలు
ఘనంగా శివరాత్రి ఉత్సవాలు


