ఆధునిక హంగులతో జెడ్పీ అతిథి గృహం
● ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్
జల్లిపల్లి సుభద్ర
● రూ.25 లక్షలతో నిర్మాణానికి
శంకుస్థాపన
ముంచంగిపుట్టు: ఆధునిక హంగులతో జెడ్పీ అతిథి గృహం నిర్మిస్తామని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. మండల కేంద్రంలో రూ.25 లక్షలతో నిర్మించనున్న జెడ్పీ అతిథి గృహానికి శనివారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పన కోసం జిల్లా పరిషత్ నుంచి నిధులు కేటాయిస్తున్నామన్నారు. ముంచంగిపుట్టులో జెడ్పీ అతిథి గృహం నిర్మించి ఎన్నో ఏళ్ల గడిచిపోవడంతో ప్రస్తుతం శిథిలావస్థకు చేరిందన్నారు. దీనివల్ల వసతి లేక మండల కేంద్రానికి వచ్చే అతిథులు, అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనివల్ల భవన నిర్మాణంపై దృష్టి సారించామన్నారు. త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. వైస్ ఎంపీపీ భాగ్యవతి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షులు పద్మారావు, సర్పంచులు రమేష్, సుభాష్‌చంద్ర, నరసింగరావు, భాగ్యవతి, ఎంపీటీసీలు సుబ్బలక్ష్మి, కమల, జిల్లా కోఆర్డినేటర్ జగబంధు, పార్టీ నేతలు సన్యాసిరావు, జయదేవ్, రాజారావు, అర్జున్, అప్పారావు, దేవ, రాంప్రసాద్, జేవీవీఎన్‌మూర్తి పాల్గొన్నారు.
బొండాపల్లిలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన
పెదబయలు: బొండాపల్లి పంచాయతీ పరిఽధిలోని బొండాపల్లికి రూ.10 లక్షల జెడ్పీ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని తెలిపారు. జేవీఎస్‌మూర్తి, సర్పంచ్ బి.మత్స్యరాజు, బొండా బాస్కర్‌రావు, కార్యకర్తలు, ఫీల్డ్ అసిస్టెంట్ చింతా కొండలరావు పాల్గొన్నారు.
ఆధునిక హంగులతో జెడ్పీ అతిథి గృహం


