జిల్లా ఉద్యాన సహాయకుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా వరుణ్
అనకాపల్లి: జిల్లా ఉద్యాన సహాయకుల సంక్షేమ సంఘం అధ్యక్షుడుగా వరుణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక ఎన్టీఆర్ క్రీడామైదానం ఆవరణలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో సంఘం ఉపాధ్యాక్షులుగా పెద్దబాబు, రవితేజ, కోశాధికారులుగా అపర్ణ, చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగ3ఆ కె.సంతోష్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా కిషోర్, సత్యప్రసాద్, సహాయ కార్యదర్శిలుగా బి.కిషోర్, ఎ.రమణ, శ్రీగౌరీ, స్వప్న, మీడియో సభ్యుడుగా శ్రీనివాస్‌తో పాటు 15 మంది ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు వరుణ్ మాట్లాడుతూ పై కమిటీ ఎన్నిక రెండు సంవత్సరాలు ఉంటుందన్నారు. జిల్లాలో ఉద్యానశాఖల విధులు నిర్వహిస్తున్న వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.


