పాడేరులో డీడీవో కార్యాలయం ప్రారంభం
పాడేరు : పరిపాలన సౌలభ్యం కోసం పాడేరులో డివిజనల్ అభివృద్ధి అధికారి (డీడీవో) కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు. గురువారం ఈ కార్యాలయాన్ని ప్రారంభంచిన ఆయన మాట్లాడారు. రాష్ట్రవాప్తంగా 77 డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వీటిలో పాడేరులో ఒకటి కావడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యాలయంలో పంచాయతీరాజ్‌కు సంబంధించి డీఎల్‌డీవో, డీఎల్పీవో, ఏపీడీ, డ్వామా తదితర శాఖల అధికారులు సేవలందిస్తారన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిపాలన సంస్కరణల్లో భాగంగా జీవో నంబరు 57,58ను తీసుకురావడం జరిగిందన్నారు. గ్రూప్–1 స్థాయి అధికారి డీఎల్‌డీవోగా విధులు నిర్వహిస్తార్తన్నారు. కార్యాలయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సొనారి రత్నకుమారి. జెడ్పిటిసి గాయత్రిదేవి, సర్పంచ్ కొట్టగుళ్లి ఉషారాణి, మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి, డీపీవో చంద్రశేఖర్, డ్వామా పీడీ విద్యసాగర్, తదితరులు పాల్గొన్నారు.


