విలువిద్య క్రీడాకారులకు అభినందన
పాడేరు : జాతీయ స్థాయి సబ్ జూనియయర్ విలువిద్య పోటీల్లో రజత పతకాలు సాధించిన గిరిజన విద్యార్థులు మోహిత్‌సాయి, వి.లలిత్‌సాయి గురువారం కలెక్టర్ దినేష్‌కుమార్‌ను కలిశారు. ఈ సందర్భంగా వీరిని ఆయన అభినంధించారు. జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటి జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చారని కలెక్టర్ పేర్కొన్నారు. ఈనెల 10 నుంచి 18 వరకు హైదరాబాద్‌లో జరిగే 32వ జాతీయ స్థాయి సీనియర్ విలువిద్య పోటీల్లో పాల్గొనే అల్లూరి ఆర్చరీ అకాడమి విద్యార్ధులు సొలగం సాంబ, మోహిత్ సాయి, సోడే దేశయ్యకు ఆర్థిక సహాయం చేయాలని కోచ్ అడపా సుధాకర్ నాయుడు కలెక్టర్ దినేష్‌కుమార్‌ను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి జగన్‌మోహన్‌రావు, కోచ్ లకే సూరిబాబు, మోదమాంబ హైస్కూల్ ప్రిన్సిపాల్ నాగమణి పాల్గొన్నారు.


