స్క్రబ్ టైఫస్‌పై అప్రమత్తత అవసరం
● డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణమూర్తి నాయక్
పాడేరు : స్క్రబ్ టైఫ స్ వ్యాధి పట్ల జిల్లా పరిధిలో వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణమూర్తినాయక్ ఆదేశించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా లోని 64 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో స్క్రబ్ టైఫస్ వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. జ్వరం, చలి, తలనొప్పి, శరీరం నొప్పులు, కండరాల నొప్పులు, ఎస్కార్–చిగ్గర్ కాటు ఉన్న చోట నలుపు రంగు గడ్డలు, శోషరస గ్రంధులు పెద్దవి కావడం, మెడ, చంకలు, గజ్జ గుదభాగం, రొమ్ము, చంక, చెవి వెనుక, పాదల దర్శనం, తీవ్రమైన జ్వరం ఐదు రోజుల కంటే ఎక్కువగా ఉంటే స్క్రబ్ టైఫస్ వ్యాధిగా అనుమానించవచ్చన్నారు. వ్యాధి నిర్థారణ అయితే తగిన చికిత్స తీసుకోవాలని సూచించారు ఈ వ్యాధిపై గ్రామస్థాయిలో క్షేత్ర స్థాయి సిబ్బంది, పర్యవేక్షణ సిబ్బంది అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌వో ఆదేశించారు.


