అన్నదాత సుఖీభవ అందలేదు
అన్నదాత సుఖీభవ సాయం అందించకుండా చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏటా కిసాన్ వికాస్ యోజన పథకం రూ.2వేలతో పాటు వైఎస్సార్ రైతు భరోసా నగదు బ్యాంకు ఖాతాలో జమ అయ్యేది. ఇటీవల కిసాన్ యోజన పథకం సాయం రూ.2వేలు మాత్రమే జమ అయింది. అన్నదాత సుఖీభవ నగదు పడలేదు. రైతన్నా మీకోసం దృష్టికి ఈ సమస్య తీసుకువెళ్లినా ఫలితం లేకపోయింది.
– తాంగుల సోమన్న, గిరిజన రైతు,
గబ్బంగి పంచాయతీ, పాడేరు మండలం
పట్టించుకోలేదు
అన్నదాత సుఖీభవ సాయం కోసం సచివాలయంతో పాటు పాడేరులో అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత గతేడాది, ఈ సారి మొత్తం రూ.4వేలు మాత్రమే పీఎం కిసాన్ వికాస్ పథకం సాయం అందింది. ఆధార్ సీడింగ్ చేసుకున్నా అన్నదాత సుఖీభవ సాయం జమకాలేదు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు.
– ఎస్.సోంబాబు,
గబ్బంగి, పాడేరు మండలం
అన్నదాత సుఖీభవ అందలేదు


