సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
రంపచోడవరం: రంపచోడవరం ఐటీడీఏ సమావేశపు హాలులో సోమవారం ఐటీడీఏ పీవో బి.స్మరణ్‌రాజ్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ వారం 55 అర్జీలు స్వీకరించినట్టు తెలిపారు. దరఖాస్తుదారుల అర్హతలను బట్టి సమస్యలు పరిష్కరించాలని అధికారులకు తెలిపారు. వై.రామవరం మండలం ఎగువ ప్రాంతంలోని మెట్టగూడెం నుంచి పులికొండ వరకు మూడు కిలోమీటర్లు రహదారి ఏర్పాటు చేయాలని శరంకోట అబ్బాయిరెడ్డి తదితరులు అర్జీ అందజేశారు. గంగవరం మండలం నువ్వుమామిడి గ్రామంలో అంగన్‌వాడీ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని వెదుళ్ల లచ్చిరెడ్డి వినతి అందజేశారు.
అర్జీలు స్వీకరిస్తున్న ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్


