● మంచు సంతకం
మన్యంలో శీతాకాలంలో జరిగే సంతలకు చాలా ప్రత్యేకత ఉంది. పొగమంచు ఆగమనంతో పర్యాటక సీజన్ కూడా మొదలవుతుంది. సందర్శకుల రాకతో సందడిగా ఉంటాయి. గిరిజనులకు ప్రధాన వాణిజ్య కేంద్రాలు కూడా ఇవే. ముఖ్యంగా చిరుధాన్యాలు, అటవీ ఉత్పత్తులు, కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు విక్రయానికి అందుబాటులో ఉంటాయి. ఈ కాలంలో పాడేరు, లంబసింగి, అరకు ప్రాంతాలకు వచ్చే పర్యాటకులు స్థానిక సంస్కృతి, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, వారపు సంతలను సందర్శిస్తుంటారు. వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఏజెన్సీ ప్రజలు వారి జీవనానికి కావాల్సిన పంటలు పండించుకుంటూ మిగిలినవి ఈ సంతల్లో అమ్ముకుంటారు. వీటిని కొనుగోలు చేసేందుకు స్థానిక వ్యాపారులే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. మంచు ముసుగులో శుక్రవారం జిల్లా కేంద్రం పాడేరు పాత బస్టాండ్‌లో జరిగిన వారపు సంతలో చిలకడ దుంపలు, నాగలి, చేమ దుంపలతో పాటు పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు, బంతి అమ్మకాలు భారీగా జరిగాయి. వీటిపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. – సాక్షి, పాడేరు
● మంచు సంతకం
● మంచు సంతకం
● మంచు సంతకం


