
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
చింతూరు: మండలంలోని తులసిపాక సమీపంలో సోకలేరువాగు ఒడ్డున శుక్రవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో గుర్తుపట్టేందుకు వీలులేకుండా ఉండడంతో మృతి చెంది సుమారు 15 రోజులకు పైబడి ఉండవచ్చని తెలుస్తోంది. మృతదేహాన్ని కుక్కలు లేదా అడవి జంతువులు పీక్కుతినడంతో ఎడమకాలు లేని స్థితిలో ఉంది. ఈ సమాచారం తెలుసుకున్న చింతూరు సీఐ గోపాలకృష్ణ, ఎస్‌ఐ రమేష్, మోతుగూడెం ఎస్.చరణ్‌నాయక్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. కాగా మృతదేహం లభ్యమైన స్థలం ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సోకిలేరు వ్యూ పాయింట్‌కు సమీపంలో ఉండడంతో పర్యటనకు వచ్చిన వ్యక్తి ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.