
క్రికెట్ పోటీల విజేత విశాఖ రెవెన్యూ జట్టు
విశాఖ స్పోర్ట్స్: జోన్–1 రెవెన్యూ ఉద్యోగుల క్రికెట్ టోర్నీ టైటిల్ పోరులో విశాఖ రెవెన్యూ జట్టు ఏడు వికెట్ల తేడాతో అనకాపల్లి రెవెన్యూ జట్టుపై విజయం సాధించింది. రైల్వే స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో జోన్ పరిధిలోని ఆరు జట్లు పోటీ పడగా ఆదివారం ఫైనల్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన అనకాపల్లి జట్టు 16 ఓవర్లలో 88 పరుగులకు ఆలౌటైంది. విశాఖ కెప్టెన్ రాజేంద్ర నాలుగు వికెట్లు తీసి మ్యాచ్ బెస్ట్‌గా నిలిచాడు. ప్రసన్న కుమార్ రెండు వికెట్లు తీశాడు. ప్రతిగా విశాఖ జట్టు 14 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి విజయలక్ష్యాన్నందుకుంది. భవానీశంకర్ 36 పరుగులతో రాణించాడు.