
హైడ్రో పవర్ ప్రాజెక్టుతో పర్యావరణానికి ముప్పు
ముంచంగిపుట్టు: జీవో నెంబర్–3ను ప్రభుత్వం పునరుద్ధరణ చేయాలని సీపీఎం నేతలు నారాయణ, జీనబంధు, సీతారాంలు కోరారు. మండలంలోని కరిముఖిపుట్టు పంచాయతీ నందిమెట్ట గ్రామంలో సీపీఎం నేతలు ఆదివారం పర్యటించారు. జీవో నెంబర్–3 రద్దుతో గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు వల్ల కలగనున్న నష్టాలను గ్రామస్తులకు తెలియజేశారు. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణంతో పాటు జల వనరులు కాలుష్యమవుతాయన్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటు యోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.