
100.5 కిలోల గంజాయి స్వాధీనం
● ఏడుగురు నిందితుల అరెస్టు
● వివరాలను వెల్లడించినఏఎస్పీ నవజ్యోతి మిశ్రా
చింతపల్లి: జిల్లా నుంచి మైదాన ప్రాంతానికి తరలిస్తున్న 97 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా తెలిపారు.ఆదివారం చింతపల్లి సబ్ డివిజనల్ పోలీసు అధికారి కార్యాలయంలో ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. చింతపల్లి సర్కిల్ పరిధి లోని అన్నవరం పోలీసులు బెన్నవరం పంచాయతీ గొడ్డుగుర్రాలుమెట్ట గ్రామం వద్ద ఆదివారం ఉదయం వాహనాలను తనిఖీ చేసినట్టు చెప్పారు. అదే సమయంలో ముందుగా పైలెట్‌గా రెండు ద్విచక్ర వాహనాలు,అనంతరం కారు, వ్యాన్ రావడంతో తనిఖీ చేసినట్టు తెలిపారు. కారులో ఐరన్ షీట్ల కింద గంజాయి ఉన్నట్టు గుర్తించినట్టు చెప్పారు. వారి వద్ద నుంచి 97 కిలోల గంజాయితో పాటు 1.07 లక్షల నగదు, 8 సెల్ ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలు, ఒక కారు, వ్యాన్‌ను స్వాధీ నం చేసుకున్నట్టు చెప్పారు. ఈ కేసులో తొమ్మిది మందికి సంబంధం ఉందని, వారిలో నలుగురు తెలంగాణా,ఇద్దరు ఒడిశా, ముగ్గురు చింతపల్లి మండలానికి చెందిన వారున్నారు.వీరిలో ఏడుగురి ని అరెస్టు చేశామని, మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు.స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.10 లక్షలు ఉంటుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో సీఐ వినోద్‌బాబు,అన్నవరం ఎస్‌ఐ వీరబాబు పాల్గొన్నారు.
గంజాయితో ముగ్గురి అరెస్టు
జి.మాడుగుల: నుర్మతి వెళ్లే రోడ్డులో బైక్‌పై తరలిస్తున్న 3.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్టు చేసినట్టు స్థానిక ఎస్‌ఐ షణ్ముఖరావు తెలిపారు. మండలంలో నుర్మతి రోడ్డులో తహసీల్దార్ కార్యాలయ జంక్షన్ వద్ద శనివారం వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో వారిని పట్టుకున్నట్టు చెప్పారు. నిందితుల నుంచి గంజాయి, ఒక బైక్,మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. గంజాయి విలువ సుమారు రూ.17,500 ఉంటుందని ఎస్‌ఐ చెప్పారు.

100.5 కిలోల గంజాయి స్వాధీనం

100.5 కిలోల గంజాయి స్వాధీనం