
డొంకరాయి గ్రామాన్ని మండల కేంద్రం చేయాలని డిమాండ్
మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం ఎదుట ప్రదర్శన
మంగళగిరి టౌన్: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న డొంకరాయి గ్రామాన్ని మండల కేంద్రంగా చేయాలని కోరుతూ ఆ గ్రామ ప్రజలు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎదుట శుక్రవారం బ్యానర్‌తో ప్రదర్శన చేశారు. 2017 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మండల కేంద్రంగా చేస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిందని, ఆ హామీని నేటికీ అమలు చేయలేదని ఆ గ్రామ ప్రజలు పేర్కొన్నారు. గత 40 సంవత్సరాలుగా అన్ని విధాల నష్టపోతున్నామని, న్యాయం చేయాలని కోరారు.