
విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల ఆందోళన
పాడేరు రూరల్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. జిల్లాలోని పాడేరు, సీలేరు, మోతుగూడెం ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో విద్యుత్ శాఖ కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు. అనంతరం ఉన్నతాధికారులకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పాడేరులో జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నయ్యపడాల్ మాట్లాడుతూ విద్యుత్ శాఖలో కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికుల నెలకొన్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, సర్వీసులను బట్టి పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అందజేయాలని డిమాండ్ చేశారు. అనంతరంలో విద్యుత్ శాఖ డీఈ వేణుగోపాల్‌కు వినతిపత్రం ఇచ్చారు. నాయకులు, కార్మికులు ఈశ్వరరావు, రాజు,చైతన్య, ప్రసాద్, విజయ్, బుల్లిబాబు తదితరులున్నారు.
సీలేరు: ఏపీ జెన్‌కో కార్యాలయం వద్ద శుక్రవారం జెన్‌కో కాంట్రాక్ట్ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. నేతలు లక్ష్మణరావు, విష్ణుకుమార్‌రాజు పాల్గొన్నారు.
మోతుగూడెం: మోతుగూడెం ఏపీ జెన్‌కో చీఫ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద కాంట్రాక్ట్ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జెన్‌కో సీఈకి అందజేశారు. ప్రేమ్‌సన్, శ్రీను, దేవుడు, సన్యాసిరావు, రాజేష్, గంగయ్య మహేష్ పాల్గొన్నారు.