
సిమెంట్ కాంక్రీట్‌తో రంగురాళ్ల క్వారీల పూడ్చివేత
డీఎఫ్‌వో నర్సింహారావు
చింతపల్లి: రంగురాళ్ల క్వారీలను సిమెంట్ కాంక్రీట్‌తో మూసివేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు డివిజన్ అటవీశాఖ అధికారి వై.నర్సింహారావు తెలిపారు. మండలంలోని సత్యవరం క్వారీని శుక్రవారం సిమెంట్ కాంక్రీట్‌తో ు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడెం కొత్తవీధి మండలంలో సిగనాపల్లి, గుర్రాలగొంది, చింతపల్లి మండలంలో మేడూరు, సత్యవరం, గురుగూడెం, పోతురాజుగున్నలు తదితర గ్రామాల్లో గుర్తించిన అన్ని క్వారీల్లో సొరంగాలను పూర్తిగా సిమెంట్ కాంక్రీట్‌తో పూడ్చివేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే సిగనాపల్లి క్వారీని మూసివేసినట్టు చెప్పారు. డివిజన్‌లో ఎక్కడా రంగురాళ్ల తవ్వకాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. రంగురాళ్ల తవ్వకాలను పోత్సహించి, వ్యాపారాలు చేస్తున్న వ్యక్తుల జాబితాను సిద్ధం చేసినట్టు చెప్పారు.ఇప్పటికే కొంతమంది వ్యాపారులపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు.