
క్రీడాకారులకు అభినందనలు
సీలేరు: ఏపీ జెన్‌కో లో ఇటీవల జరిగిన కబడ్డీ పోటీల్లో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ప్రతిభను కనబర్చిన సీలేరు కాంప్లెక్సు క్రీడాకారులను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమంలో జెన్‌కో కాంప్లెక్స్ సూపరింటెండెంట్ ఇంజినీర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 47 సంవత్సరాల తరువాత రాష్ట్రానికి కబడ్డీ పోటీల్లో ఏపీ విద్యుత్ జట్టుకు స్థానం దక్కిందని, ఆ జట్టులో సీలేరుకు చెందిన డీఈఈ శ్రీనివాసులు కెప్టెన్‌గా వ్యవహరించడం ఆనందంగా ఉందన్నారు. ఏపీ జట్టు జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో తృతీయస్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. ఏపీ జట్టుకు సీలేరు నుంచి నలుగురు క్రీడాకారులు ఎంపిక కావడంతో పాటు, సీలేరుకు చెందిన కొండల శ్రీను ఉత్తమ ప్రతిభ కనబర్చి బెస్ట్ డిఫెండర్‌గా ఎంపికై నట్టు చెప్పారు. జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించిన సీహెచ్.సురేష్‌తో పాటు జట్టు కెప్టెన్ శ్రీనివాసులు, శ్యాంసన్, ప్రసాద్ ఎస్‌ఈ, డీఈఈ రాజేంద్రప్రసాద్, అకౌంట్స్ అధికారి ఈవీవీ సత్యనారాయణ చేతులమీదుగా ఘనంగా సన్మానించారు. క్రీడాకారులకు ప్రత్యేక ట్రోఫీలు, మెడల్స్‌ను అందజేశారు.అదే విధంగా పోటీలో సహకరించిన యువతకు బహుమతులిచ్చారు.