
సెక్యూరిటీ గార్డుతోరక్త పరీక్షలా?
● లక్ష్మీపురం సర్పంచ్ కోర్రా త్రినాథ్ ఆవేదన
● మండల సర్వసభ్య సమావేశంలో ధ్వజం
ముంచంగిపుట్టు: స్థానిక సీహెచ్‌సీలో సెక్యూరిటీ గార్డుతో రక్త నమూనాల సేకరించి, పరీక్షలు చేస్తే ఎలా అని లక్ష్మీపురం సర్పంచ్ కోర్రా త్రినాథ్ ధ్వజమెత్తారు. సాక్షిలో ప్రచురితమైన కథనాన్ని చూపిస్తూ గురువారం జరిగిన మండల సర్వసభ్య సమావేశం ఆయన వైద్యసిబ్బంది, ఎంపీడీవో ధర్మారావును ప్రశ్నించారు. దీనిపై ఉన్నతస్థాయి అధికారులు, కలెక్టర్, ఐటీడీఏ పీవో కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. సీహెచ్‌సీలో పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బందిని నియమించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఆస్పత్రిలో అంబులెన్సు పాడైందని, కనీసం 108 సేవలు కూడా అందుబాటులో లేవన్నారు. దీనిపై సీహెచ్‌సీని తనిఖీ చేసి వైద్యసేవలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో ధర్మారావు పేర్కొన్నారు.

సెక్యూరిటీ గార్డుతోరక్త పరీక్షలా?