
వైద్య కళాశాలలోఎనస్తీషియా దినోత్సవం
● ఘనంగా ప్రపంచ ఎనస్తీషియా
దినోత్సవం
సాక్షి,పాడేరు: ప్రపంచ ఎనస్తీషియా దినోత్సవాన్ని స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో గురువారం ఘనంగా నిర్వహించారు, ప్రిన్సిపల్ డాక్టర్ డి.హేమలతాదేవి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య కార్యక్రమాలు.అత్యవసర వైద్యంలో మత్తు వైద్య నిపుణుల పాత్రను ఆమె వైద్య విద్యార్ధులకు వివరించారు. కోవిడ్ సమయంలో మత్తు వైద్యవిభాగం బాధితులకు విశేష సేవలు అందించిందన్నారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాల వైద్యనిపుణులు, వైద్య విద్యార్ధులు పాల్గొన్నారు.