
అధ్వానంగా డీఆర్ డిపో భవనం
పాడేరు రూరల్: మండలంలో చింతలవీధి పంచాయతీ కేంద్రంలో ఉన్న డీఆర్ డిపో భవనం అధ్వానంగా మారింది. భవనం ప్రాంగణం పిచ్చిమొక్కలు, తుప్పలతో నిండి ఉంది. విషసర్పాలు, కీటకాలతో ప్రమాదభరితంగా మారిందని స్థానికులు చెందుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ పొందేందుకు కార్డుదారులు నానా అవస్థలు పడుతున్నారని చెబుతున్నారు. అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని పలువురు చెబుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు.