
కూటమి ప్రభుత్వం అరాచక పాలన
● కోటి సంతకాల సేకరణ
కరపత్రాల ఆవిష్కరణ
● అరకులోయ ఎమ్మెల్యే రేగం
మత్స్యలింగం
డుంబ్రిగుడ: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గురువారం రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కరపత్రాలు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తోందని, ప్రజలు గమనిస్తున్నారన్నారు. త్వరలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమం విజయవంతమైందన్నారు. ఇప్పుడు రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమంతో పాటు కమిటీల నియామకాలు కూడా పూర్తి చేస్తామన్నారు. కోటి సంతకాల సేకరణలో అనుబంధ విభాగాలు క్రియాశీలకంగా ఉండాలని కమిటీల నిర్వహణలో అలసత్వ వద్దన్నారు. ఉత్సాహం, తపన, బాధ్యతతో పనిచేయాలని ముందుకొచ్చేవారిని గుర్తించి కమిటీల్లో ప్రాధాన్యతనివ్వాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. రాష్ట్రంలో నకిలీ మధ్యం ఏరులై పారుతోందని ఆయన ధ్వజమెత్తారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు ఇంటివద్దనే అందజేస్తే కూటమి ప్రభుత్వం చంద్రబాబు రివర్స్ పాలన సాగిస్తుందని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పాంగి పరశురామ్, వైస్ ఎంపీపీ శెట్టి ఆనంద్‌రావు, కితలంగి, పోతంగి, గుంటసీమల సర్పంచ్‌లు సుబ్బారావు, గుమ్మ నాగేశ్వరరావు, వంతాల వెంకటరావు, నాయకులు సింహాచలం, నరేష్, అప్పలరాజు, రామ్‌దాసు, బబిత, నిర్మల, మండల కార్యదర్శి రామ్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.