
ఆత్మీయ సన్మానం
సాక్షి, పాడేరు: జిల్లా కేంద్రం పాడేరులో బుధవారం పర్యటించిన వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడు ఇరుకు రామకృష్ణను ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయ కమిటీ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఆలయంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అంతకుముందు మోదకొండమ్మతల్లిని రామకృష్ణ దర్శించుకున్నారు. ఆలయ కమిటీతో పాటు స్థానిక వాసవీ క్లబ్ ప్రతినిధులు ఆయనను ఘనంగా సన్మానించారు. పేదలకు చీరలు పంపిణీ చేశారు.అన్నదాన కమిటీకి బియ్యం, ఇతర నిత్యావసర సామాగ్రిని అందజేశారు.స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వాసవీక్లబ్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన సరస్వతీదేవి, సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ విగ్రహాలను రామకృష్ణతో పాటు వాసవీ క్లబ్ జిల్లా అధ్యక్షురాలు కొల్లూరి పార్వతి, పట్టణంలోని ఆర్యవైశ్య కుటుంబాలు ఘనంగా ఆవిష్కరించారు. వాసవీ క్లబ్ ప్రతినిధులు శ్రీనాథ శ్రీను, ఉడా త్రినాథరావు, సత్యవరపు సోమరాజు, పుట్టా నానాజీ, శ్రీనాథ శీరిషా, ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి రమాదేవి, ప్రధాన కార్యదర్శి ఉప్పల వెంకటరత్నం, వైదేహి తదితరులు పాల్గొన్నారు.

ఆత్మీయ సన్మానం