
క్రీడారంగ బలోపేతానికి సమష్టి కృషి
● డీఈవో బ్రహ్మాజీరావు
పాడేరు రూరల్: క్రీడా రంగం బలోపేతానికి అంతరూ సమిష్టిగా కృషి చేయాలని డీఈవో బ్రహ్మాజీరావు సూచించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం వివిధ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 17, 18, 21, 22 తేదీల్లో నిర్వహించే డివిజన్ స్థాయి ఆర్చరీ అండర్ 14,17,19 పోటీలు విజయవంత చేయాలన్నారు. వచ్చే నెల 7, 8, 9 తేదీల్లో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ఉంటాయన్నారు. విద్యార్ధులకు అవసరమైన శిక్షణ అందించి ప్రోత్సహించాలని సూచించారు. ఎస్‌జీఎఫ్ క్రీడా కార్యదర్శులు పాంగి సూరిబాబు, భవాని తదితరులు పాల్గొన్నారు.