
గృహ నిర్మాణాలు వేగవంతం
● హౌసింగ్ పీడీ బాబునాయక్
కొయ్యూరు: పీఎం జన్‌మన్ గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని హౌసింగ్ పీడీ బాబు నాయక్ సూచించారు. ఆయన బుధవారం డౌనూరు పంచాయతీ బచింతలో నిర్మాణంలో ఉన్న గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పూర్తయిన గృహాలకు వేగంగా బిల్లుల చెల్లింపునకు కృషి చేస్తున్నామన్నారు. నిర్మాణ పనుల్లో ఎటువంటి జాప్యం చేయవద్దన్నారు.బూదరాళ్ల పంచాయతీలో నిర్మాణాలు కొన్నిచోట్ల వేగంగా జరిగితే మరి కొన్ని చోట్ల జరగడం లేదన్నారు. ఆయన వెంట ఏఈ పొత్తూరు ఉమామహేశ్వరరావు, వర్క్ ఇనస్పెక్టర్ గిరీష్ పాల్గొన్నారు.