
జీఎస్టీ తగ్గింపుతోసామాన్యులకు మేలు
● కలెక్టర్ దినేష్‌కుమార్
చింతూరు: జీఎస్టీ తగ్గింపుతో సామాన్యులకు ఎంతో మేలు చేకూరుతుందని, దీనివల్ల ఎన్నోరకాల వస్తువుల ధరలు తగ్గనున్నాయని కలెక్టర్ దినేష్‌కుమార్ అన్నారు. జీఎస్టీ తగ్గింపుపై బుధవారం స్థానిక ఏకలవ్య విద్యార్థుల ప్రదర్శనను ఆయనతోపాటు పీవో శుభం నొఖ్వాల్ తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూనిత్యావసర సరకుల ధరలు తగ్గాయన్నారు. జీఎస్టీ తగ్గినా ఇంకా అదనపు ధరలకు సరకులు విక్రయించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.