460 టు 690 | - | Sakshi
Sakshi News home page

460 టు 690

Oct 16 2025 5:35 AM | Updated on Oct 16 2025 5:35 AM

460 ట

460 టు 690

ఆరు నెలల్లో..
పెరగనున్న పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్ర ఉత్పత్తి సామర్థ్యం
రాష్ట్రంలో జలవిద్యుత్‌ ఉత్పాదనలో ప్రత్యేకత సంతరించుకున్న పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రం మరో మైలురాయిని అధిగమించనుంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.530 కోట్లతో చేపట్టిన 5,6 యూనిట్లు ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటిని ఏప్రిల్‌ నాటికి పూర్తి చేసి వినియోగంలోకి తేవాలన్న లక్ష్యంతో ఏపీ జెన్‌కో అధికారులు పనిచేస్తున్నారు.

జల విద్యుత్‌ కేంద్రంలో జరుగుతున్న ఐదు, ఆరు యూనిట్ల నిర్మాణ పనులు

టెర్మినల్‌ యాంకర్‌ నుంచి వాల్వ్‌ హౌస్‌ వరకు పూర్తయిన పెన్‌స్టాక్‌ పైపులైన్‌

మెగా

వాట్లు

మోతుగూడెం: పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఐదు, ఆరు యూనిట్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటికి సంబంధించి పెన్‌ స్టాక్‌ పనులు 60 శాతం, సివిల్‌ పనుల్లో ఫ్లోర్‌ శ్లాబ్‌కు సంబంధించి 80శాతం మేర పూర్తయినట్టు జెన్‌కో అధికారవర్గాలు తెలిపాయి.

● ఐదవ యూనిట్‌కు సంబంధించి కీలకమైన స్పారల్‌ కేసింగ్‌ పనులు పూర్తయ్యాయి. దీంతోపాటు వికెట్‌ గేటు ద్వారా నీటిని విడుదల చేసే రన్నర్‌ మీద స్పారల్‌ కేసింగ్‌ పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. వాల్వుహౌస్‌ నుంచి టెర్మినల్‌ యాంకర్‌ వరకు పూర్తిస్థాయిలో పెన్‌స్టాక్‌ పైపులైను నిర్మాణం పూర్తయింది.

● ఆరో యూనిట్‌కు సంబంధించి జనరేటర్‌ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. యూనిట్లకు సంబంధించి కీలకమైన విడిభాగాలు సకాలంలో బీహెచ్‌ఎల్‌ , ఇతర కంపెనీ నుంచి పవర్‌ హౌస్‌కు వచ్చేలా జెన్‌కో అధికారులు చర్యలు చేపట్టారు. ఎస్‌ఎస్‌సీ పీఈసీ కంపెనీ ప్రతినిధుల అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను బీహెచ్‌ఎల్‌, ప్రాజెక్ట్‌ అధికారుల బృందం అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

● ప్రస్తుతం ఈ జలవిద్యుత్‌ కేంద్రంలో నాలుగు యూనిట్ల ద్వారా 460 మెగావాట్లు ఉత్పాదన జరుగుతోంది. 5,6 యూనిట్లు అందుబాటులోకి వస్తే ఉత్పత్తి సామర్థ్యం 690 మెగావాట్లకు పెరుగుతుందని ప్రాజెక్ట్‌ అధికారవర్గాలు పేర్కొన్నాయి.

అండర్‌ గ్రౌండ్‌లో పెన్‌స్టాక్‌ పైపునకు

వెల్డింగ్‌ చేస్తున్న కార్మికులు

వేగవంతం చేశాం

వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌ నాటికి ఐదు, అరు యూనిట్ల నిర్మాణ పనులు పూర్తయ్యేలా వేగవంతం చేశాం. ఇవి పూర్తయితే 460 నుంచి 690 మెగావాట్లకు ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. సిబ్బంది, అధికారులు శ్రమిస్తున్నారు.

– బాలకృష్ణ, డీఈ, ఏపీ జెన్‌కో

లక్ష్యం మేరకు పూర్తిచేస్తాం

నిర్దేశించిన లక్ష్యం మేరకు ఆదనపు యూనిట్ల నిర్మాణ పనులు పూర్తిచేస్తాం. ఇందుకు జెన్‌కో యాజమాన్యం, డైరక్టర్ల ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాం. నిర్మాణ పనులను ఎప్పటి కప్పుడు పర్యవేక్షించి, సూచనలు ఇస్తున్నాం.

– సీహెచ్‌వీ రాజారావు, చీఫ్‌ ఇంజినీరు, పొల్లూరు

చురుగ్గా ఐదు, ఆరు యూనిట్ల

నిర్మాణ పనులు

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో

మంజూరు

రూ.530 కోట్లతో చేపట్టిన

గత ప్రభుత్వం

సివిల్‌ పనులు 80 శాతం, పెన్‌స్టాక్‌ పనులు 60 శాతం పూర్తి

ఏప్రిల్‌ నాటికి ఉత్పత్తి

ప్రారంభిస్తామంటున్న జెన్‌కో అధికారులు

460 టు 6901
1/2

460 టు 690

460 టు 6902
2/2

460 టు 690

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement