
నల్లబ్యాడ్జీలతో వైద్య సిబ్బంది నిరసన
కూనవరం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు గత నెల 26 నుంచి సమ్మెబాట పట్టడంతో వారికి మద్దతుగా స్థానిక పీహెచ్‌సీ సిబ్బంది మంగళవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ విధులు నిర్వహించారు. ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తుష్టి జోగారావు, ఐఎన్‌టీయూసీ డివిజన్ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో రెండు రోజుల పాటు సిబ్బంది నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో వైద్యులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సిబ్బంది అభద్రతాభావంతో సేవలు అందించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అత్యవసర కేసుల సమయంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. వైద్యుడు ఉంటే ఎలాంటి ప్రమాదానైనా ఎదుర్కొని ప్రాణాపాయం నుంచి కాపాడే అవకాశం ఉంటుందన్నారు. అందువల్ల ప్రభుత్వం సమ్మెబాటలో ఉన్న వైద్యుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి విధుల్లో చేరేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ అసోసియేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గుజ్జా సీతమ్మ, రవ్వా రాంఆంజనేయులు, ఎంఎల్‌హెచ్‌పీలు, 104 సిబ్బంది పాల్గొన్నారు.
విధులు నిర్వహిస్తూ
పీహెచ్‌సీ వైద్యుల సమ్మెకు మద్దతు