
అర్థమయ్యే రీతిలో బోధించండి
● ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచన
అడ్డతీగల: విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం రాత్రి స్థానిక ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలతో పాటు వీరవరం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్, సబ్‌కలెక్టర్ శుభం నొఖ్వాల్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలను ఒకటికి రెండు సార్లు అర్ధమయ్యే రీతిలో బోధించాలని సూచించారు.విద్యతో పాటు వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి రోజు మెనూ పక్కాగా అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయులు బోధించిన పాఠాలు అర్థమవుతున్నదీ లేనిది విద్యార్థుల నుంచి తెలుసుకున్నారు. సౌకర్యాలపై ఆరా తీశారు.