
159 ఎకరాల్లో బెర్రీ బోరర్‌తో నష్టం
అరకులోయ టౌన్: పాడేరు డివిజన్‌లో గిరి రైతులకు ప్రధాన ఆదాయ వనరు కాఫీ. సుమారు 2.30 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు ఉండగా వీటిలో 1.50 లక్షల ఎకరాలు ఫలసాయం ఇస్తున్నాయి. డుంబ్రిగుడ, అరకువ్యాలీ ప్రాంతాల్లో బెర్రీ బోరర్ (కాయతొలుచు పురుగు) నష్టం కలుగచేసినప్పటికీ మిగతా చోట్ల దిగుబడి ఆశాజనకంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రెండు మండలాల్లో 159 ఎకరాల్లో నష్టం జరిగిందని ఐటీడీఏ కాఫీ బోర్డు ఏడీ లకే బొంజుబాబు తెలిపారు. చినలబుడు పంచాయతీ మాలివలస, తురాయిగుడ, మాలిసింగారం, పెదలబుడు పంచాయతీ గరడగుడ, డుంబ్రిగుడ మండలంలో శాంతినగర్, కురాయి ప్రాంతాల్లో రైతులు నష్టపోయారు.
● బెర్రీ బోరర్ సోకిన తోటల్లో పండ్లను సేకరించి గోతులు తవ్వి పూడ్చిపెట్టడానికి రూ.5 వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వీటిని సంబంధిత తోటల్లో పండ్లు సేకరించి పూడ్చిపెట్టిన కూలీలకు నేరుగా కాఫీ బోర్డు అందజేయాల్సి ఉంది. ఈ నిధులు విడుదల కాలేనట్టుగా తెలుస్తోంది.