
ఉపాధి పనుల కొలతల్లో తేడాలు
వై.రామవరం: ఉపాధి హామీ పథకంలో చేపట్టిన రూ.68 లక్షల విలువైన పనుల్లో కొలతల్లో తేడా రావడంతో మళ్లీ నిర్వహించాలని ఆదేశించినట్టు ఉపాధి హామీ పథకం పీడీ డాక్టర్ విద్యాసాగర్ తెలిపారు. మండలంలో ఉపాధి హామీ పథకం పనులపై నిర్వహించిన సామాజిక తనిఖీలపై మంగళవారం స్థానిక ఉపాధిహామీ కార్యాలయంలో ప్రజావేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీడీ మాట్లాడుతూ రూ.17.54 కోట్లతో పంచాయతీరాజ్ శాఖలో జరిగిన 2,278 పనులకు సోషల్ ఆడిట్ నిర్వహించినట్టు చెప్పారు. ఈ పనుల్లో పొరపాట్లు జరగడంతో రూ.6,789 రికవరీ చేశామన్నారు. కొంతమంది సిబ్బందికి రూ.7వేలు జరిమానా విధించినట్టు చెప్పారు. ఎంపీడీవో కె.బాపన్నదొర అధ్యక్షతన నిర్వహించిన ఈసభలో ఎంపీపీ కడబాల ఆనందరావు, జెడ్పీటీసీ కర్ర వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీలు ముర్ల జోగిరెడ్డి, వలాల విశ్వమ్మ, ఎంపీటీసీ వీరమళ్ళ సుబ్బలక్ష్మి, సర్పంచ్ పల్లాల బాలురెడి, ఏపీడీ టి.ఎస్. విశ్వనాఽథ్, విజిలెన్స్ అధికారి సురేష్, ఏపీవోలు సాయిబాబ, స్వామి పాల్గొన్నారు.
మళ్లీ నిర్వహించాలని పీడీ ఆదేశం