
దేశ సమగ్ర అభివృద్ధికినూతన ఆవిష్కరణలు దోహదం
చింతపల్లి: దేశ సమగ్ర అభివృద్ధికి నూతన ఆవిష్కరణలు ఎంతో దోహదపడతాయని ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లు కనక కుమార్ చాంద్, వీకే చాంద్‌లు తెలిపారు. స్థానిక డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ విజయ భారతి ఆధ్వర్యంలో జాతీయ సెమినార్ ముగింపు కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా దేశాన్ని పరివర్తన చేయడం,ఆవిష్కరించడం,సవాళ్లు మరియు అవకాశాలపై సెమినార్ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి కావలసిన పరిజ్ఞానం, పరిశోధకుల కృషిని వివరించారు. విద్యార్థులతో పోస్టర్ ప్రజెంటేషన్ చేయించారు. ఈకార్యక్రమంలో పీఎం ఉష కోఆర్డినేటర్ వి. రమణ,వైస్ ప్రిన్సిపాల్ లకే పాత్రుడు పాల్గొన్నారు.