
కోరుకున్న చోట పునరావాసం కల్పించాలి
వీఆర్‌పురం: పోలవరం నిర్వాసితులకు కోరుకున్న చోట పునరావాసం కల్పించాలని స్థానిక సర్పంచ్ పిట్టా రామారావు, పీసా కమిటీ ఉపాధ్యక్షుడు కోటం జయరాజు డిమాండ్ చేశారు. బుధవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. నిర్వాసితులు కోరుకున్న చోట పునరావాసం క ల్పిస్తామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది తప్ప ఆచరణలో చూపడం లేదని వారు చెప్పారు. పునరావాసం అడిగింది ఒకచోటయితే వేరే చోట స్థలం చూపిస్తుండడంతో నిర్వాసితులు ఆందోళన చేందుతున్నారని తెలిపారు. గోదావరి వరదలకు సర్వం కోల్పోయిన వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు చెప్పారు. నిర్వాసితుల సమస్యలపై బుధవారం చింతూరు ఐటీడీఏ కార్యాలయం వద్ద నిర్వహించనున్న ధర్నాకు రామవరం, చింతరేవుపల్లి పంచాయతీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.