
చేతబడి నెపంతో వ్యక్తిపై కత్తితో దాడి
చింతూరు : చేతబడి చేస్తున్నాడన్న నెపంతో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన మంగళవారం చిడుమూరు గ్రామంలో జరిగింది. చింతూరు ఎస్‌ఐ పేరూరి రమేష్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బొక్కలి మల్లయ్య మనుమరాలు అనారోగ్యానికి గురైంది. ఇందుకు అదే గ్రామానికి చెందిన దురవా పిచ్చయ్య చేతబడి చేయడమే కారణం అన్న అనుమానంతో అతనిపై మల్లయ్య కత్తితో దాడి చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. తీవ్రంగా గాయపడిన పిచ్చయ్య చింతూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.