
మౌలిక వసతులపై అటవీశాఖ దృష్టి
● జాతీయ రహదారి నుంచి జలపాతం వద్దకు వెళ్లే మార్గాన్ని గ్రావెల్‌తో నిర్మించింది. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు సౌకర్యం కల్పించింది.
● పర్యాటకులు కూర్చునేందుకు వీలుగా బెంచీలు, తాత్కాలిక షెడ్లు నిర్మించింది. జలపాతంలోకి పూర్తిగా వెళ్లకుండా సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేసింది. వీటికి రూ.13 లక్షలు వెచ్చించినట్టు అటవీశాఖ రేంజర్ నానాజి తెలిపారు.ఫోర్‌బే డ్యామ్, పుష్ప బ్రిడ్జి, సీలేరు నది ప్రాంతాల్లో సందర్శకుల సౌకర్యార్థం వసతులు కల్పిస్తున్నామన్నారు. పర్యాటకులకు ప్రదేశాన్ని చూపించేందుకు నియమించిన ఐదుగురు యువకులు ఉపాధి పొందుతున్నారన్నారు.
రూ.45 లక్షల మంజూరు
పొల్లూరు జలపాతంతోపాటు ఇతర ప్రదేశాల్లో పర్యాటకులకు సదుపాయాలు కల్పించేందుకు రూ.45 లక్షలు ఏపీ జెన్‌కో నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అటవీశాఖ ప్రణాళికపరంగా చర్యలు తీసుకుంటోంది.