
పూడిమడక మత్స్యకారుల సంఘీభావం
అచ్యుతాపురం: నక్కపల్లి మండలం రాజయ్యపేట పరిధిలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు ఉద్యమిస్తున్న మత్స్యకారులకు మద్దతుగా పూడిమడక మత్స్యకారులు ఆదివారం తీరప్రాంతంలో నిరసన తెలిపారు. మత్స్యకార్మిక సంఘం నాయకులు చేపల తాతయ్య మాట్లాడుతూ అప్పలరాజు, ఉమాదేవిని తొమ్మిది రోజుల పాటు గృహనిర్భంధం చేయడం దారుణమన్నారు. బల్క్ డ్రగ్ పార్కు వల్ల ఆ ప్రాంతంలో మత్స్య సంపదకు తీవ్ర ఆపద ఉందన్నారు.తీర ప్రాంతాల్లో నివసిస్తున్న మత్స్యకారుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోందని, మరోవైపు తక్కువ ధరకు ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ ఇచ్చే మత్స్యసంపద ఇక్కడి తీర ప్రాంతంలో దొరికే అవకాశం నానాటికీ తగ్గుతుందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పటి హోం మంత్రి అనిత ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లాఠీలతో ఉద్యమాలను ఆపలేరని స్పష్టం చేశారు. కరక సోమునాయుడు, ఎల్లయ్య, రాజు, గుర్రయ్య,పోతురాజు తదితరులు పాల్గొన్నారు.