
నిర్వాసితులకు సాగు భూమిని గుర్తించండి
రంపచోడవరం: పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు వ్యవసాయానికి అనువుగా ఉన్న భూమిని గుర్తించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం ఆయన స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో పీవో స్మరణ్‌రాజ్, సబ్ కలెక్టర్ శుభమ్ నొఖ్వాల్, ఎస్‌డీసీలు, ఇంజనీర్లు, ఆర్‌అండ్‌ఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలవరం ముంపునకు గురైన చింతూరు, రంపచోడవరం డివిజన్‌లోని నిర్వాసితులకు భూమికి భూమి ఇచ్చేందుకు ప్రైవేట్ భూమికి సంబంధించిన నివేదికలు సమర్పించాలని సూచించారు. గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల్లో ఒక్కొక్క మండలంలో ఏమేర గుర్తించింది రెవెన్యూ అధికారులతో చర్చించారు. గిరిజనులకు భూమికి భూమి ఎన్ని ఎకరాలు అవసరమో తెలుసుకున్నారు. భూములు కొనుగోలుకు సంబంధించి ఇప్పటివరకు నిర్వహించిన గ్రామ సభలు, యాక్షన్ ప్లాన్‌పై ఆయన ఆరా తీశారు. గిరిజనేతరులకు సంబంధించి పునరావాస పనులపై చర్చించారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో గృహాలు నిర్మించేలా టెండర్లు నిర్వహణపై అధికారుల నుంచి తెలుసుకున్నారు. ఆర్‌అండ్‌ఆర్ పెండింగ్ పనులు త్వరితంగా పూర్తి చేయాలని ఆదేశించారు.శ్మశానవాటిక లేని ఆర్‌అండ్ ఆర్ కాలనీలకు భూమిని కొనుగోలు చేసి వాటిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్‌డీసీలు పి.అంబేడ్కర్, నాసరయ్య, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఏజెన్సీలో మంజూరైన పనులు ప్రారంభించాలి
ఏజెన్సీలో మంజూరైన రోడ్లు, వంతెన పనులు పూర్తి చేయించాలని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్‌ను కోరారు. పీవో చాంబర్‌లో మంగళవారం ఎమ్మెల్యే కలెక్టర్‌ను కలిసి ఏజెన్సీలో మారుమూల గ్రామాలకు రోడ్ల నిర్మాణానికి అటవీ అభ్యంతరాలు తొలగించాలన్నారు.
అధికారులకు కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం