
గుండెకు అత్యవసరవైద్యంపై అవగాహన
సాక్షి,పాడేరు: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు గుండెకు సంబంధించిన అత్యవసర వైద్యంపై వైద్య నిపుణులు మంగళవారం అవగాహన కల్పించారు. స్థానిక వైద్య కళాశాల మత్తు వైద్య విభాగాధిపతి డాక్టర్ సతీష్‌కుమార్,అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉషారాణి, కమ్యూనిటీ మెడిషన్ విభాగాధిపతి డాక్టర్ సంధ్యారాణి, సైకియాట్రి ఇన్‌చార్జి హెచ్‌వోడీ డాక్టర్ టీ.ఎస్.ఎస్.రాజులు గుండె, ఉపిరితిత్తుల పునరుద్ధరణ చర్య కార్యకలాపాలను డెమో ద్వారా విద్యార్థులకు వివరించారు.అత్యవసర పరిస్థితులలో వ్యక్తుల ప్రాణాలు కాపాడేందుకు సీపీఆర్ వ్యవస్థ కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వనుము చిట్టబ్బాయి, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.