
వేడుకగా పొల్లూరుధారాలమ్మ జాతర
మోతుగూడెం: పొల్లూరు గ్రామ దేవత ధారాలమ్మ జాతర మహోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఉదయం నుంచి అమ్మవారిని గరగ నృత్యాలతో ఊరేగించారు. అనంతరం ఆలయ వద్ద పూజారి కుమార స్వామి శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పొల్లూరు, మోతుగూడెం, ఒడిశాకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నసమారాధన ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ జెన్‌కో సీఈ రాజారావు, ఈఈ బాలకృష్ణ, వరప్రసాద్, శ్రీనివాస్, ఎస్‌ఏవో వరప్రసాద్, ఏడీఈ కొండబాబు, చింతూరు ఎస్‌ఐ రమేష్, ఎంపీటీసీ వేగి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

వేడుకగా పొల్లూరుధారాలమ్మ జాతర