
వర్షాలకు కూలిన కళామందిరం, కల్వర్టు
జి.మాడుగుల: మండలంలో కురుస్తున్న వర్షాలకు కళామందిర భవనం, కల్వర్టు కూలిపోగా, అప్రోచ్ ర్యాంప్ దెబ్బతింది. మండల కేంద్రం జి.మాడుగులలో రామాలయం వీధిలో కళామందిరం స్టేజ్ ఇటీ వల కుప్పకూలిపోగా, నుర్మతి–మద్దిగరువు గ్రామా నికి వెళ్లే మార్గంలో సూరిమెట్ట వద్ద సీపీ అప్రోచ్ ర్యాంప్ దెబ్బతింది. జి.ఎం. కొత్తూరు– జోగులపుట్టు రోడ్డులో కల్వర్టు అడుగుభాగం కొట్టుకుపోవడంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదార్లు ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని భయాందోళనలు చెందుతున్నారు. దెబ్బతిన్న కల్వర్టు, సీసీ అప్రోచ్ ర్యాంప్‌కు మరమ్మతులు చేపట్టాలని, కూలిన కళా మందిరం స్టేజ్ స్థానంలో కొత్త దానిని నిర్మించాలని మాజీ ఎంపీపీ, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు మత్స్యరాస వెంకటగంగరాజు,బొయితిలిసర్పంచ్ లసంగి మాలన్న కోరారు.
దెబ్బతిన్న రోడ్లు
పాడేరు రూరల్: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని పలు రోడ్లు దెబ్బతిన్నాయి. అమ్మవారి (పాదాలు) ఆలయం నుంచి డల్లాపల్లి, బూరుగుచెట్టు, అల్లివరం మీదుగా ఉన్న రహదారి కోతకు గురైంది. దీంతో వాహనచోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బూరుగుచెట్టు గ్రామం నుంచి సలుగు పంచాయతీ కేంద్రం మీదుగా ఈదులపాలెం తదితర ప్రాంతాలకు వెళ్లే రోడ్డు గోతులమయంగా మారింది. దీంతో తరచూ వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. అత్యవసర సమయంలో అంబులెన్స్ రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

వర్షాలకు కూలిన కళామందిరం, కల్వర్టు

వర్షాలకు కూలిన కళామందిరం, కల్వర్టు

వర్షాలకు కూలిన కళామందిరం, కల్వర్టు

వర్షాలకు కూలిన కళామందిరం, కల్వర్టు