
నేతల నిర్బంధం దుర్మార్గం
దేవరాపల్లి: నక్కపల్లి మండలం రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్కును పెట్టొద్దని మత్స్యకారులు చేపడుతున్న ఆందోళనలో పాల్గొన్న సీపీఎం నేతల పట్ల ప్రభుత్వం, పోలీసుల తీరు అప్రజాస్వాకమని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న అన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.అప్పలరాజును కొన్ని రోజులుగా పోలీసులు గృహ నిర్బంధం చేయడాన్ని ఖండిస్తూ దేవరాపల్లిలో ఆదివారం నిరసన చేపట్టారు. రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా వేలాది మంది మత్స్యకారులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారని, దీనికి పరిశీలించేందుకు వెళ్లిన హోంమంత్రి అనిత గత నెల 29న వెళ్లగా మత్స్యకారులు కారును అడ్డగించి ఆందోళన చేపట్టారన్నారు. దీనికి సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అప్పలరాజు కారణమని గృహ నిర్భందంలో ఉంచారని, ఇది అత్యంత దుర్మార్గమన్నారు. దీనికి కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తక్షణమే అప్పలరాజుపై గృహ నిర్భందాన్ని తొలగించాలని, లేదంటే ఈనెల 15న జిల్లా వ్యాప్తంగా అన్ని మండల ఆందోళన చేస్తామని హెచ్చరించారు.