
రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి హెల్త్‌కేర్ పరికరాలు
● అందజేసిన ఆర్క్ సర్వ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెట్ ఇండియా
● విలువ రూ.2 లక్షలు
రంపచోడవరం: స్థానిక ఏరియా ఆస్పత్రికి సమారిటన్స్ ఫర్ ది నేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆర్క్ సర్వ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెట్ ఇండియా హెల్త్‌కేర్ పరికరాలను శనివారం అందజేసింది. దీనిలో భాగంగా నాలుగు ఆక్సిజన్ సిలెండర్లు, 12 చానల్ ఈసీజీ మెషీన్లు, హ్యాండ్ ఆక్సీమీటర్లు, పది మంచం మెట్రస్‌లు, బెడ్లు అందజేసినట్టు సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యప్రకాష్ తెలిపారు. వీటి విలువ రూ.2 లక్షలు ఉంటుందన్నారు. సమారిటన్స్ ఫర్ దినేషన్ వ్యవస్థాపకుడు పి.రామ్‌కుమార్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు బలోపేతం చేయడంలో సాఫ్ట్‌వేర్ సంస్థ అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంవో డా. రాహుల్, డా. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.