
జన విజ్ఞాన వేదిక కృషి అభినందనీయం
గంగవరం: విద్యార్థులల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చడం కోసం జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమని ఏజెన్సీ డీఈవో వై.మల్లేశ్వరరావు అన్నారు. శనివారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే చెకుముకి సైన్స్ సంబరాలు –2025 పోస్టర్స్‌ను స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాల ఆవరణలో ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు, మండల విద్యాశాఖాధికారి –2 టి.మల్లేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏజెన్సీ డీఈవో మాట్లాడుతూ విద్యార్థుల్లో సైన్స్ పట్ల అభిరుచి పెంచడం, శాసీ్త్రయదృక్పథాన్ని అలవర్చడం, మూఢ నమ్మకాలను పారదోలడం కోసం 35ఏళ్లుగా జన విజ్ఞాన వేదిక కృషి చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు టి. బొజ్జయ్య, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.కృష్ణ, ఎం.వెంకన్న దొర, యూటీఎఫ్ మండల మహిళా అధ్యక్షురాలు రుక్మిణీదేవి, యాట్ల సత్యనారాయణ, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు