
చలువ పిండి
దుంప నుంచి తయారీ
కిలో రూ 270 నుంచి రూ.300
శరీరంలో వేడిని తగ్గించేందుకు
వినియోగం
మార్కెట్లో మంచి డిమాండ్
సాగును ప్రోత్సహిస్తే గిరి రైతులకు సిరులు
వర్షాకాలంలో నాటుతాం
పాలగుండ నీటిని తాగడం వల్ల చాలా చలువ చేస్తుంది. ఇంట్లో నిల్వ ఉంచుకుంటాం. గ్రామాల్లోకి మైదాన ప్రాంతాల నుంచి వచ్చి అధికంగా కొనుగోలు చేస్తున్నారు. వర్షకాలంలో దుంపలు నాటుతాం. వేసవి కాలం నాటికి పంట దిగుబడి వస్తుంది.
– వంతల రామో,
వనుగుపుట్టు,ముంచంగిపుట్టు మండలం
ఎన్నో ఉపయోగాలు
పాలపిండి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎటువంటి రసాయనాలు వినియోగించకుండా ప్రకృతి వనరులతో పండించిన దుంపల నుంచి తయారు చేస్తున్నారు. ప్రభుత్వం, పాడేరు ఐటీడీఏ పాలపిండి సాగును ప్రోత్సహించాలి.
– ఎంఎం శ్రీను, గిరిజన సంఘం,
ముంచంగిపుట్టు
ఐటీడీఏ ప్రోత్సహించాలి
పాలపిండి సాగును ఐటీడీఏ ప్రోత్సహించాలి. పూర్తిశాతం రాయితీపై దుంపను రైతులకు సరఫరా చేయాలి. అందుకు తగ్గట్టుగా సాగుకు అవసరమైన పెట్టుబడిని రుణ రూపంలో అందించాలి. సహకారంల లేకనే సాగును విస్తరించలేకపోతున్నాం.
– వి.సిద్ధేశ్వరరావు,
దిగువ కుమడ, ముంచంగిపుట్టు మండలం
పాల పిండి తయారీకి గిరి రైతులు దుంపలను సేకరించే పైరు
భలే ఆదాయమండి!
దుంపల నుంచి తీసిన పాలు
ముంచంగిపుట్టు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లోని గిరిజనులు పాలపిండి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు శరీరంలో వేడి తగ్గించేందుకు ఉపయోగించే ఈ పిండిని ఇంట్లో వినియోగించేవారు. ఇప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నందున వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. పాడేరు ఐటీడీఏ ప్రోత్సహిస్తే మంచి ఆదాయవనరుగా మారుతుందని గిరిజన రైతులు పేర్కొంటున్నారు. ఈ సాగును ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లోని 152 గ్రామాల్లో చిన్నచిన్న కమతాల్లో చేస్తున్నారు. మొత్తంమీద సుమారు 1253 ఎకరాల్లో సాగు చేస్తున్నట్టు అంచనా. ఒడిశాలోని లంతాపుట్టు, మాచ్‌ఖండ్, ఒనకడిల్లీ, పాడువ ప్రాంతాల్లో కూడా విస్తారంగా పండిస్తున్నారు. ఇళ్ల వద్ద చిన్న చిన్న కమతాల్లో పెరటి పంటగా సాగు చేస్తున్నారు. పసుపు పంట మాదిరిగానే దుంపను నాటుకోవాలి. సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా పండించవచ్చని గిరిజన రైతులు తెలిపారు.
దుంప నుంచి..
మొక్క పక్వానికి వచ్చిన తరువాత దుంపను పైకి తీసి నీటితో శుభ్రం చేస్తారు. గరుకుగా ఉండే జల్లెడ వెనుక భాగంపై రుద్దితో వచ్చే పిప్పిని, రసాన్ని పాత్రలోకి సేకరిస్తారు. ఒక రాత్రంతా రసాన్ని ఊరబెడతారు. మరుసటి రోజు ఉదయం రసాన్ని పాత్రలో పోసి ఎండబెడతారు. వారం రోజులకు పూర్తిగా ఎండిపోయి, కేకు ఆకారంలో గట్టిగా తయారవుతుంది. అనంతరం వీటిని ముక్కలుగా కోస్తారు. ఇలా ఎంతో కష్టపడి పాల పిండిని గిరిజనులు తయారు చేస్తున్నారు. దీనిని మార్కెట్‌లో కిలో రూ.270 నుంచి రూ.300 వరకు అమ్ముతున్నారు. మైదాన ప్రాంత వాసులు నేరుగా గిరిజనుల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. వీరి నుంచి సేకరించిన పాలపిండి ముక్కలను మైదాన ప్రాంతంలో వ్యాపారులు రూ.400 ధరకు పైగా అమ్ముతున్నారు.
ప్రయోజనాలివీ..
పాల పిండిని నీటిలో కలుపుకొని తాగుతుంటారు. చిన్నపాటి చేదు అనిపించే వారు పంచదార కలిపి సేవిస్తారు. శరీరంలో వేడిని క్షణాల్లో తగ్గించి చలువ చేస్తుందని గిరిజనులు చెబుతున్నారు. పచ్చ కామెర్ల వ్యాధిగ్రస్తులు వినియోగిస్తారని తెలిపారు.
● సరిహద్దు గ్రామాల్లో ప్రతి గిరిజనుడి ఇంటివద్ద పాలపిండి నిల్వ ఉంటుంది. వేసవి కాలంలో ఇంటికి వచ్చే అతిథులకు పాలపిండి నీటిని ఇవ్వడం ఆనవాయితీ. రోగనిరోధక శక్తి పెంపులో ఉపయోగపడుతుందని గిరిజనులు చెబుతున్నారు.
సాగును ప్రోత్సహిస్తే మంచి ఆదాయం: పాలపిండి సాగును వాణిజ్యపరంగా ఐటీడీఏ తగిన సహకారం అందించి పోత్సహిస్తే గిరిజన రైతులకు మంచి ఆదాయ వనరుగా మారుతుందని పలువురు సూచిస్తున్నారు. గతంలో సరిహద్దు గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలు సాగు గురించి తెలుసుకున్న సందర్భాలు ఉన్నాయి. అవసరమైన రుణ సౌకర్యం అందిస్తామని, సాగు విస్తీర్ణం పెంచాలని హామీఇచ్చినా కార్యరూపం దాల్చిన పరిస్థితులు లేవు.
శరీరంలో వేడి చేస్తే కొబ్బరి నీళ్లు, నిమ్మ రసం తాగుతాం. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గిరిజనులు మాత్రం పాలపిండి (బిత్తిరి పాలు) నీళ్లను తాగుతారు. శరీరంలో వేడిని తగ్గించడంలో దివ్య ఔషధంగా
పనిచేస్తుంని వారు చెబుతుంటారు. గిరిజనులు కేవలం ఇంట్లో మాత్రమే
వినియోగించే ఈ పిండికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో సాగుపై ఆసక్తి చూపుతున్నారు. వాణిజ్యపరంగా సాగుకు ఐటీడీఏ సహకారం అందిస్తే మంచి ఆదాయ వనరుగా మారుతుందని వారు చెబుతున్నారు.
సేకరించిన దుంపలు
దుంప పాలతో తయారుచేసిన పాలపిండి పలుకులు

చలువ పిండి

చలువ పిండి

చలువ పిండి

చలువ పిండి

చలువ పిండి

చలువ పిండి