
విద్యార్థులకు చతుర్విధ ప్రక్రియ నేర్పించాలి
పెదబయలు: గిరిజన విద్యార్థులకు చతుర్విధ ప్రక్రియలు తప్పనిసరిగా నేర్పించాలని ఏపీ విద్యాశాఖ అసిస్టెంట్ మానిటరింగ్ అధికారి కల్పన సూచించారు. శనివారం మండలంలో జరుగుతున్న రెండవ విడత ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె మాట్లాడుతూ ప్రతీ విద్యార్థికి చదవడం, రాయడం, గణితంలో చతుర్విద ప్రక్రియలు నేర్పించాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు. ఇందుకు గాను ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేయాలన్నారు. ఎంఈవోలు కృష్ణమూర్తి, పుష్పజోసెఫ్, డీఆర్పీలు పాల్గొన్నారు.
ఏపీ విద్యాశాఖ అసిస్టెంట్ మానిటరింగ్ అధికారి కల్పన