
ఊడిన ఆర్టీసీ బస్సు చక్రం
రాజవొమ్మంగి: ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు చక్రం ఊడిపడిన ఘటన బోర్నగూడెం వద్ద సోమవారం చోటుచేసుకుంది. ఏలేశ్వరం డిపోకు చెందని ఆర్టీసీ బస్సు రాజవొమ్మంగి నుంచి ఏలేశ్వరం వెళుతుండగా మార్గ మధ్యంలో బోర్నగూడెం వద్ద గోతిలో పడి చక్రం ఊడిందని బస్సులోని ప్రయాణికులు తెలిపారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఎటువంటి ప్రమా దం జరగలేదు. గోతులతో నిండిన ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని, కండిషన్‌లో ఉన్న బస్సులనే ఏజెన్సీప్రాంతానికి నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఆర్టీసీ బస్సు నుంచి ఊడిపడిన చక్రం