
రణభేరి
కల్తీ మద్యంపై
పాడేరు: కల్తీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ డిమాండ్ చేశారు. కల్తీ మద్యానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం పాడేరులో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. స్థానిక ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు క్యాంప్ కార్యాలయం నుంచి సినిమాహాల్ సెంటర్ మీదుగా ఎకై ్సజ్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎకై ్సజ్ స్టేషన్ వద్ద వర్షంలో తడుస్తూ ధర్నా నిర్వహించారు. అనంతరం ఎక్సైజ్ సీఐ ఆచారికి వైఎస్సార్‌సీపీ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మహిళావిభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేసి మద్యాన్ని నామమాత్రంగా అందుబాటులో ఉంచిందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరూ మద్యానికి బానిస అయ్యేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ కోట్లాది రూపాయలను కూటమి నాయకులు జేబుల్లో వేసుకుంటున్నారని ఆరోపించారు. కల్తీ మద్యంపై వైఎస్సార్‌సీపీ పోరు కొనసాగిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు సీద రి రాంబాబు, నుర్మానీ మత్స్యకొండంనాయు డు, జీకే వీధి జెడ్పీటీసీ కిముడు శివరత్నం, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్నదొర, క్రిస్టియన్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు తిమోతి, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కిల్లో ఊర్వశిరాణి, జి.మాడుగుల మండల మహిళా అధ్యక్షురాలు నీలమ్మ, సర్పంచ్‌లు వంతాల రాంబాబు, గొల్లోరి నీలకంఠం, వనుగు బసవన్నదొర, గబ్బాడ చిట్టిబాబు, కొర్ర సుభద్ర, ఎంపీటీసీలు దూసురి సన్యాసిరావు, ముదిలి సత్యనారాయణ, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో పోరుబాట
జోరువానలో నిరసన హోరు
కల్తీ మద్యంతో ప్రాణాలు
పోతున్నాయని ఆగ్రహం
జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు, ధర్నాలు
పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు
ఎకై ్సజ్ అధికారులకు
వినతిపత్రాలు అందజేత