ప్రజల ప్రాణాలతో కూటమి నాయకుల చెలగాటం | - | Sakshi
Sakshi News home page

ప్రజల ప్రాణాలతో కూటమి నాయకుల చెలగాటం

Oct 14 2025 7:05 AM | Updated on Oct 14 2025 7:05 AM

ప్రజల

ప్రజల ప్రాణాలతో కూటమి నాయకుల చెలగాటం

అరకులోయటౌన్‌: రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీని అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ నియోజకవర్గ కేంద్రమైన అరకులోయలో మహిళా ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు సోమవారం కదం తొక్కారు. అరకులోయ జెడ్పీటీసీ శెట్టి రోషిణి, యువజన నాయకుడు రేగం చాణిక్య, పార్టీ నాయకులు ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం నుంచి ఎకై ్సజ్‌ స్టేషన్‌ వరకు సుమారు రెండు కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించారు. మార్గమధ్యంలో భారీ వర్షం కురిసినప్పటికీ లెక్కచేయకుండా ర్యాలీ కొనసాగించారు. ఎక్సైజ్‌ స్టేషన్‌కు చేరుకుని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సీఐ ఆర్‌.శ్రావణ్‌ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ శెట్టి రోషిణి మాట్లాడుతూ కూటమి నాయకులు కల్తీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చెప్పారు. యువజన నాయకుడు రేగం చాకిణ్య మాట్లాడుతూ కల్తీ మద్యం తయారు చేస్తూ అడ్డంగా దొరికి పోయిన కూటమి నాయకులను కాపాడేందుకు ప్రభుత్వ పెద్దలు యత్నిస్తుండడం సిగ్గుచేటన్నారు. అనంతగిరి ఎంపీపీ శెట్టి నీలవేణి మాట్లాడుతూ కల్తీ మద్యం కేసుల్లో పట్టుబడిన వారంతా టీడీపీకి చెందిన వారేనని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత వాడవాడలా బెల్ట్‌ షాపులు వెలిశాయని చెప్పారు. హుకుంపేట వైస్‌ ఎంపీపీ సుశీల మాట్లాడుతూ రాష్ట్రంలో కల్తీ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయన్నారు. డుంబ్రిగుడ జెడ్పీటీసీ జానకమ్మ మాట్లాడుతూ బెల్ట్‌షాపులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ డుంబ్రిగుడ మండల అధ్యక్షుడు పాంగి పరశురామ్‌ మాట్లాడుతూ కల్తీ మద్యం కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు బాక ఈశ్వరి, సీతమ్మ, వైస్‌ ఎంపీపీలు కిల్లో రామన్న, లలిత కుమారి, శెట్టి ఆనంద్‌, పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్‌, పార్టీ మండల అధ్యక్షులు రామూర్తి, చంద్రుబాబు, సూర్యనారాయణ, అనిల్‌, సర్పంచ్‌లు సుస్మిత, పూర్ణిమ, నాగేశ్వరరావు, పాగి అప్పారావు, బుటికి, పార్టీ మండల ఉపాధ్యాక్షులు విజయ్‌కుమార్‌, ప్రకాష్‌, పార్టీ నాయకులు సందడి కొండబాబు పాల్గొన్నారు.

మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు

రంపచోడవరం: రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులైపారుతోందని వైఎస్సార్‌ సీపీ రంపచోడవరం నియోజకవర్గ కోఆర్డినేటర్‌,మాజీ ఎమ్మెల్యే నాగుపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌(అనంతబాబు) ధ్వజమెత్తారు. కల్తీ మద్యం తయారీకి వ్యతిరేకంగా రంపచోడవరం నియోజకవర్గంలోని 11 మండలాల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో కలిసి స్థానిక అంబేడ్కర్‌ సెంటర్‌ నుంచి ఎకై ్సజ్‌ స్టేషన్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎకై ్సజ్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే నాగుపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ నారా వారి కల్తీ లిక్కర్‌తో రాష్ట్రం మద్యాంధ్రప్రదేశ్‌గా మారిందని విమర్శించారు. మద్యం, బెల్ట్‌షాపుల్లో టీడీపీ నాయకులు విచ్చలవిడిగా నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతలు కల్తీ మద్యం తయారీని కుటీర పరిశ్రమ స్థాయికి తీసుకువెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త మద్యం పాలసీ ముసుగులో విచ్చలవిడిగా మద్యం దుకాణాలు, బెల్ట్‌ షాపులు ఏర్పాటు చేశారన్నారు. చంద్రబాబు, లోకేష్‌ సన్నిహితుడే కల్తీ మద్యం తయారీలో కీలక పాత్రధారి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం ఎంపీపీ బంధం శ్రీదేవి, జెడ్పీటీసీ పండా వెంకటలక్ష్మి, దేవీపట్నం ఎంపీపీ కుంజం మురళి, జెడ్పీటీసీ శిరసం సత్యవేణి, మారేడుమిల్లి జెడ్పీటీసీ గొర్ల బాలాజీ బాబు, అడ్డతీగల జెడ్పీటీసీ మద్దాల వీర్రాజు, రంపచోడవరం వైస్‌ ఎంపీపీ కొమ్మిశెట్టి బాలకృష్ణ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజల ప్రాణాలతో కూటమి నాయకుల చెలగాటం1
1/1

ప్రజల ప్రాణాలతో కూటమి నాయకుల చెలగాటం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement