
వేగవంతంగా గృహ నిర్మాణ పనులు
రాజవొమ్మంగి: రంపచోడవరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.అంబేడ్కర్ శుక్రవారం రాజవొమ్మంగి ఎంపీడీవో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. సీజనల్ వ్యాధుల పట్ల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు, సిబ్బందిని కోరారు. ఇప్పటికే మంజూరైన పీఎం జన్‌మన్, పీఎం గ్రామీణ్ శాశ్వత గృహ నిర్మాణాలను లక్ష్యం మేరకు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆదికర్మ యోగి కార్యకలాపాల్లో భాగంగా విలేజి డెవలప్‌మెంట్ ప్లాన్ ఎంత వరకు వచ్చింది ఆరా తీశారు. పీ4లో భాగంగా బంగారు కుటుంబాల ఎంపిక, అంగన్‌వాడీ, హాస్టల్స్ పరిసరాల్లో పారిశూద్యం కోసం తీసుకొంటున్న చర్యలను అడిగి తెలుసుకొన్నారు. పిల్లలకు సురక్షితమైన త్రాగునీరు అందించాలని సూచించారు. ఎంపీడీవో యాదగిరీశ్వరరావు, పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్ ఏఈ, విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.